![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో ది బెస్ట్ కంటెస్టెంట్ గీతు రాయల్ ఎలిమినేషన్ నిజమా? కాదా? అనే సందేహాలు ప్రేక్షకులలో ఉన్నాయి. ఎందుకంటే టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారు. కాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో గీతు ఎలిమినేట్ అయ్యింది.
అయితే గీతు తన మైండ్ గేమ్ తో అందరిని తికమక పెడుతూ ఎన్నో టాస్క్ లు గెలిచింది. చాలా సార్లు ప్రోమోలో కూడా తనే హైలైట్ గా నిలిచింది. కాగా నాగార్జున చాలా సార్లు తన ఆటతీరును మెచ్చుకున్నాడు. తను కెప్టెన్ అయితే చూడాలనుకునేవారు లేకపోలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న గీతు ఎలిమినేషన్ హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరిని షాక్ కి గురిచేయగా, ప్రేక్షకులు బిత్తరపోయారు. అయితే ప్రేక్షకులు వేసే ఓటింగ్ లో గీతు కన్నా తక్కువగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా గీతుని ఎలిమినేట్ చేయడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కాగా గీతు ఎలిమినేషన్ గురించి హౌస్ మేట్స్ అందరు షాక్ అయ్యారు. ఆదిరెడ్డి, ఫైమా బాగా ఏడ్చేసారు. అయితే బిగ్ బాస్ చూసే అభిమానులు మాత్రం గీతు ఎలిమినేషన్ అన్ ఫెయర్ అని అంటున్నారు. సీక్రెట్ రూంలో ఉంచి గీతుని మళ్ళీ హౌస్ లోకి తీసుకొస్తారేమో చూడాలి మరి.
![]() |
![]() |